విజయవాడ: దుర్గగుడి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం ప్రదర్శించడం కలకలం రేపుతోంది. దుర్గగుడిలో సింహాచలం అనే ఉద్యోగి గత కొంతకాలంగా పని చేస్తున్నాడు. అతని భార్య దుర్గ కూడా గుడిలోనే కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తోంది. అయితే హుండీలోని బంగారాన్ని సింహాచలం చోరీ చేసి.. తన భార్య దుర్గ చేతికి బంగారం ఇచ్చి పంపుతుండగా దుర్గగుడి అధికారులు పట్టుకున్నారు. సింహాచలం దంపతులు 8 గ్రాముల బంగారాన్ని చోరీ చేసినట్టు గుర్తించారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు సింహాచలం దంపతులను అదుపులోకి తీసుకున్నారు.