logo

'పహిల్వాన్'కు ప్రచారం చేస్తున్న చిరంజీవి


05-Jun-2019 14:09IST
chiranjeevi giving publicity to kichcha sudeep pahilwan

ఈగ, బాహుబలి సినిమాలతో తెలుగు ప్రజలకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు సుదీప్. ప్రస్తుతం కన్నడలో ఓ చిత్రంలో సుదీప్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో పహిల్వాన్ పేరుతో విడుదల చేయనున్నారు. స్వప్నపహిల్వాన్ నేతృత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అర్జున్ జన్యా సంగీతం అందిస్తున్నారు. సుదీప్ సరసన ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా కబీర్ దుహాన్ సింగ్ విలన్‌గా కనిపించనున్నారు.  
అయితే తాజాగా 'పహిల్వాన్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ కిల్లింగ్ లుక్స్‌లో సుదీప్ నిజమైన పహిల్వాన్‌లా ఉన్నాడని తెలిపారు. ఈ రియల్ పహిల్వాన్ తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతాడని చెప్పారు.

Tags: chiranjeevi publicity kichcha sudeep pahilwan

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top