logo

హత్యకు గురైన సాఫ్ట్‌వేర్‌...


05-Jun-2019 16:38IST
Murderous software

కడప:  రైల్వే కోడూరు పట్టణంలో బుధవారం తెల్లవారు జామున దారుణం జరిగింది. ఓ వ్యక్తిని కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తుల్తో దారుణంగా పొడిచి చంపారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పోలీసులు మరియు కుటుంబ ససభ్యులు తెలిపిన వివరాల ప్రకారం  పట్టణంలోని రంగనాయుకుల పేటకు చెందిన సాబ్‌జాన్‌ కుమారుడు షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌ బెంగుళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రంజాన్‌ పండుగ సందర్భంగా బెంగుళూరు నుంచి రైలు ద్వారా  కోడూరు చేరుకుని బస్సు దిగి ఇంటికి వస్తుండగా శ్రీకృష్ణ సినిమా హాల్ సమీపంలోకి రాగానే దుండగులు అతనిపై కత్తులతో  దాడిచేసి  హతమార్చారు. ఇదిలా ఉండగా ఖాదర్‌కు ఈ నెల 23న వివాహం నిశ్చయమైంది. ఈ సమయంలో తమ కుమారుడు హత్యకు గురికావడం తల్లిదండ్రులకు మరియు కుటుంబ సబ్యులకు ఇంట్లో తీరని విషాదం నెలకొంది.  పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు. కేసు నమోదుచేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తామని దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Tags: Murder software suspect

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top