logo

కారు లారీ ఢీకొని ఇద్దరు మృతి


06-Jun-2019 09:09IST
2 members died in accident

కారు లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో తిరుపతికి వెళ్లి కర్నూలుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓర్వకల్లు దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ  కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షేతగాత్రులను అక్కడే ఉన్న ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్నూలులోని డాక్టర్స్ కాలనీలో నివసించే సాయిబాబా శర్మ, సతీష్‌‌లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

Tags: 2 members died accident kurnool car lorry

Advertisement
Advertisement
Top