logo

అక్టోబర్ 15 నుండి 'రైతు భరోసా' పథకం అమలు ...


06-Jun-2019 14:45IST
raithu barosa scheme starts on october 15

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతన్నలకు 2019 ఎన్నికల హామీ మేరకు శుభవార్త అందించారు. గురువారం ఉదయం జరిగిన వ్యవసాయ శాఖ సమీక్షలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో అక్టోబర్‌ 15 నుంచి 'రైతు భరోసా' కార్యక్రమం నిర్వహిస్తున్నామని అధికారులకు జగన్‌ తెలిపారు. ఎన్నికల హామీ మేరకు రైతులకు రూ.12,500 ఇస్తామని స్పష్టం చేశారు. కాగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'అన్నదాత సుఖీభవ' పథకంను రద్దుచేసిన వైఎస్ జగన్.. దాని స్థానంలో 'రైతు భరోసా' పథాకాన్ని ప్రారంభించారు. 

Tags: raithu barosa scheme ys jagan mohan reddy

Advertisement
Advertisement
Top