logo

మెట్రోస్టేష‌న్ వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం.?


07-Jun-2019 11:20IST
road accident

8 మంది భార‌తీయులు మృతి...
గురువారం సాయంత్రం దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న‌ది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల్లో 8 మంది భారతీయులున్నారు. కాగా దుబాయిలోని భారత రాయబార కార్యాలయం గురువారం రాత్రి వెల్లడించింది. 31 మంది ప్రయాణికులతో ఒమన్‌ నుంచి దుబాయికి వెళుతున్న బస్సు మార్గమధ్యంలో ఓ మెట్రో స్టేషన్‌ వద్ద సైన్‌బోర్డును వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అక్క‌డి దుబాయి పోలీసులు వెల్లడించారు. 
భార‌తీయుల వివ‌రాలు వెల్ల‌డించారు.. 
భారత్‌కు చెందిన రేష్మ ఫిరోజ్‌ ఖాన్‌ పఠాన్‌, రాజగోపాలన్‌, ఫిరోజ్‌ ఖాన్‌ పఠాన్‌, దీపక్‌ కుమార్‌, జమాలుద్దీన్‌ అరక్కవీటిల్‌, కిరన్‌ జానీ, వాసుదేవ్‌, తిలక్‌రామ్‌ జవహార్‌ ఠాకూర్ సంఘ‌ట‌నా స్థ‌లంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. ప్రమాదంలో మరికొందరు భారతీయులు గాయపడగా.. వారికి ప్ర‌త్యేక చికిత్స‌లు అందిస్తున్నారు.

Tags: dubai road accident 7 members died

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top