logo

ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం


08-Jun-2019 11:12IST
the terrorists death in the encounter

శ్రీనగర్: జ‌మ్మూక‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా వేరినాగ్ ప్రాంతంలో శనివారం భారత సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జ‌రిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతిచెందాడు. తెల్లవారుజామున వేరినాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర భద్రతా జవాన్లు గాలింపు చేపట్టారు. జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. శుక్రవారం పుల్వామా సమీపంలోని పంజరన్ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ కు చెందిన నలుగురు మరణించారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.

Tags: terrorist's death encounter jammu ananthnag

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top