logo

రోజూ గొడ‌వ‌లు ప‌డుతుంద‌ని త‌ల్లినే హ‌త్య చేశాడు..!


09-Jun-2019 09:38IST
Mother murdered

ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర‌నుంచి ఇరుగుపొరుగు వారితో తరచూ గొడవపడుతూ ఇబ్బంది కలిగిస్తున్న కారణంగా న‌వ మాసాలు మోసి క‌న్న తల్లినే తనయుడు హత్య చేసిన ఘటన  నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలంలో చోటు చేసుకున్నది.  సంఘటనకు సంబంధించి పోలీసులు క‌థ‌నం ప్రకారం.. మన్నెవారిపల్లికి చెందిన భారతమ్మ (53) తరచూ ఇంటి చుట్టుప‌క్క‌ల వారితో చీటికి మాటికి  త‌గాదాలు తెస్తుండ‌టంతో ఆమెపై వారు కుటుంబసభ్యులకు స్ధానికులు ఫిర్యాదు కూడా చేశారు. కుమారుడు సైద‌ తల్లిని కూడా చాలాసార్లు మందలించాడు. అయినా ఆమె వైఖరిలో మార్పు లేదు. శుక్రవారం కూడా ఇదే ప‌రిస్థితి త‌లెత్త‌డంతో తీవ్ర‌స్థాయిలో కోపోద్రీక్తుడైన సైద రోకలిబండతో భార‌త‌మ్మ తలపై మోదాడు. ఆమె చనిపోకపోవడంతో గొంతు నులిమి హత్య చేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: crime murdere

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top