logo

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం


10-Jun-2019 10:28IST
the road accident in Kerala

తిరువునంతపురం: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలక్కాడ్‌ దగ్గర అంబులెన్స్‌, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ప్ర‌మాదం ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారంతా పట్టాంభి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులంతా ట్రిప్‌కు వెళ్లొస్తుండగా ప్రమాదం జరగ్గా.. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ఘోరం జరిగింది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.a

Tags: road accident kerala 8 peoples died

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top