logo

బాలున్ని మింగిన మొస‌లి..


10-Jun-2019 11:07IST
The crocodile swallowed the boys

భోపాల్ : 18 ఏళ్ల బాలుడిని మొస‌లి మింగేసిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చంబ‌ల్ న‌దిలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోరీనా జిల్లా నగ్రా గ్రామంలోని నగ్రా ఘాట్ వద్ద నరేంద్ర తోమార్ (18) అనే బాలుడు చంబల్ నదిలో ఈత కొట్టేందుకు దిగాడు. తన తాత అంత్యక్రియల అనంతరం స్నానం చేసేందుకు నదిలో దిగిన నరేంద్ర తోమార్ ను ఓ మొసలి అమాంతం మింగింది. చంబల్ నదిలో 500కుపైగా మొసళ్లు ఉన్నాయి. నదిలో మొసళ్లు ఉన్నాయన్న విషయం తెలిసి కూడా బాలుడి స్నానం చేసేందుకు నదిలోకి దిగి మొసలి బారిన పడి జాడ లేకుండా పోయాడు. పోలీసులు సమాచారం అందుకొని గజఈతగాళ్లను తీసుకొని చంబల్ నది వద్దకు వచ్చినా మొసళ్లు ఉన్నాయనే భయంతో నదిలోకి దిగేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

Tags: crocodile swallowed boy bhopal

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top