logo

కత్తితో భార్యను హత మార్చాలనుకున్న భర్త


10-Jun-2019 12:30IST
a husband who wants to try to kill his wife with a knife

కడప:  పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్న గౌసియాపై ఆమె భర్త ఇస్మాయిల్‌ కత్తితో దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన గౌసియాకు ప్రొద్దుటూరులోని పెన్నానగర్‌ కాలనీవాసి అయిన ఇస్మాయిల్‌తో 8 సంవత్సరాల క్రితం వివాహమయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇదిలా ఉండగా, తరుచూ ఇద్దరూ బాగా గొడవ పడేవారు. ఈ క్రమంలో గౌసియా ఎర్రగుంట్లలోని తన పుట్టింటికి వెళ్ళింది.  ఇస్మాయిల్‌ ఎర్రగుంట్లలోని భార్య వద్దకు వెళ్లి తనతో గొడవ పడ్డాడు. ఈ ఘర్షణలో ఆమెపై కత్తితో దాడి చేయగా గౌసియా తలకు, చేతికి గాయాలు కావడంతో స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గౌసియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ప్రొద్దుటూరు ఔట్‌పోస్టు పోలీసులు తెలిపారు.

Tags: a husband try to kill wife knife

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top