logo

ఆరుగురు దోషులు..


10-Jun-2019 13:08IST
six convicts

జ‌మ్మూక‌శ్మీర్‌లోని క‌తువాలో గ‌త ఏడాది 8 ఏళ్ల బాలిక‌ను దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పంజాబ్ ప‌తాన్‌కోట్ కోర్టు తీర్పు వెల్ల‌డించింది. ఎట్టకేలకు ఈ అత్యాచారం కేసులో ఆరుగుర్ని దోషులుగా తేల్చింది. ఈ కేసులో మొత్తం ఏడు విచార‌ణ ఎదుర్కొన్నారు. అత్యాచార కేసులో ప్ర‌ధాన నిందితుడు పూజారి సంజీ రామ్‌ను దోషిగా తేల్చారు. ఆయ‌న కుమారుడు విశాల్‌ను మాత్రం నిర్దోషిగా ప్ర‌క‌టించారు. ఈ కేసుకు సంబంధించి విచార‌ణ‌ను జూన్ 3వ తేదీన ముగించారు. తీర్పు సంద‌ర్భంగా ఇవాళ కోర్టు వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రేప్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న విశాల్‌.. ఆ స‌మ‌యంలో ప‌రీక్ష‌లు రాస్తున్న‌ట్లు కోర్టుకు తెలిపారు. యూపీలోని మీర‌ట్‌లో అత‌ను ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన‌ట్లు కోర్టు ముందు స‌మ‌ర్పించారు. దీంతో ఈ కేసులో అత‌న్ని నిర్దోషిగా ప్ర‌క‌టించారు. దోషుల‌కు ఎంత శిక్ష వేయాల‌న్న దానిపై మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మ‌ళ్లీ వాద‌న‌లు చేప‌ట్ట‌నున్నారు. ఆరుగురు దోషుల‌పై మూడు సెక్ష‌న్లను విధించారు. సెక్ష‌న్ 201, 120 బి సెక్ష‌న్ల కింద ఆ ఆరుగుర్ని అరెస్టు చేశారు. క‌తువా అత్యాచార కేసులో దోషులుగా తేలిన వారిలో సాంజీ రామ్‌, ఆనంద్ ద‌త్త‌, ప్ర‌వేశ్ కుమార్‌, దీప‌క్ ఖాజురియా, సురేంద‌ర్ వ‌ర్మ‌, తిల‌క్ రాజ్‌లు ఉన్నారు.

Tags: Kathua rape six accused guilty

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top