logo

ప్రాణాలు తీసిన అతివేగం


10-Jun-2019 13:17IST
life is the fastest

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం..
ప్రాణాలు తీసిన ఇనుప చువ్వ‌లు
డ్రైవ‌ర్ స‌హా 11 మంది మృతి
26 మందికి తీవ్ర‌గాయాలు
జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని బస్సు ఢీకొట్టడంతో, బస్సు డ్రైవర్‌ సహా 11 మంది మృతి చెందారు.ఈ ప్రమాదంలో మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. గాయ‌ప‌డిన వారి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. జార్ఖండ్‌ రాష్ట్రం హజారీబాగ్‌ చాపహరణ్‌ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికుల్లో చాలామంది బస్సులో చిక్కుకోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం, గాయపడడం జరిగింది. బాధితులంతా బీహార్‌ వాసులని గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. జార్ఖండ్‌లోని ధనువాఘాట్‌లో ఇనుప చువ్వలతో వెళ్తున్న ఓ లారీ మరమ్మతులకు గురై ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి పర్యాటకులతో వస్తున్న ఓ బస్సు బ్రేకులు పెయిల్‌ కావడంతో ఆ ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇనుప చువ్వలు బస్సులో నుంచి దూసుకువచ్చి ప్రయాణికుల ప్రాణాలు తీశాయి. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా మృతులు, క్షతగాత్రులు చాలామంది బస్సులోనే చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు 9 మృతదేహాలను బయటకు తీశారు. బస్సును అతివేగంగా నడిపిస్తుండడం వల్ల డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోయాడని, అదే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

Tags: Accident jharkhand 11 people ded

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top