logo

మైన‌ర్ల‌పై అత్యాచారం..


10-Jun-2019 15:17IST
rape on minors

న్యూఢిల్లీ: అలీఘర్‌లో చిన్నారి హత్యానంతరం యూపీలో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగింది. మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు మహిళలపై కూడా అత్యాచారం జరిగింది. ఖుషీనగర్ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక కాన్పూర్ జిల్లాలో 15 ఏళ్ల విద్యార్థిపై ఉపాధ్యాయుడే పైశాచికానికి దిగాడు. జలాన్ జిల్లాలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం హతమార్చారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ అత్యాచార ఘటనలన్నీ ఆదివారం నమోదయ్యాయి. కాగా పక్క రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో కూడా ఆదివారమే రెండు అత్యాచార కేసులు నమోదయ్యాయి. రాజధాని భోపాల్‌లో 10 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. ఆమె శనివారం అర్థరాత్రి నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆదివారం ఉదయం సమీప ప్రాంతంలో శవమై కనిపించింది. ఇక జబల్‌పూర్ జిల్లాలో 16 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి నిర్భంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పై అన్ని ఘటనలపై ఆయా ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరిని అత్యాచారానంతరం హత్యా చేశారు. నాలుగు కేసుల్లో పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags: rape minors ..

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top