logo

ప్రేమ జంట ఆత్మహత్య


11-Jun-2019 10:03IST
love couple suicide

హైద‌రాబాద్‌: ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్కర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బీటెక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం తిరుగుతున్న‌ ఎల్బీనగర్‌కు చెందిన తెలపల్లి స్వర్ణలత క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న కొర్రతండా చిల్లపురం యువకుడు మోహన్  కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ‌ను తల్లిదండ్రులు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఈ నెల 8న చందానగర్‌లోని వీవీప్రైడ్ లాడ్జిలో ఓ రూమ్‌ను అద్దెకు తీసుకుని అదే రూంలో విషంతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీదవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Tags: lovers suicide lodge hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top