నెటిజన్ల ట్రోల్స్ భారిన పడేవారు సెలబ్రిటీ మహిళలే అనడంలో ఏ మాత్రం సందేహించాల్సిన పని లేదు. అయితే కొందరు మహిళామణులు ఇలా ట్రోల్స్ చేస్తున్న వారిని ఘాటుగా మందలిస్తుండగా, మరి కొంతమంది మహిళలు మాత్రం సైలెంట్ కావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడు నటి సురేఖా వాణి కూతురు సుప్రీత కూడా నెటిజన్లపై మండిపడింది. సురేఖావాణి కూతురు సుప్రిత షేర్ చేసిన ఓ వీడియోపై రెచ్చిపోయి కామెంట్లు పెడుతూ ఆమెను, ఆమె తల్లి సురేఖావాణిని తెగ ట్రోల్స్ చేశారు నెటిజన్లు. ఇది చూసిన సుప్రిత అలాంటి వారిపై విరుచుకుపడుతూ దిమ్మతిరిగే కౌంటర్ వేసింది. ఇటీవలే సుప్రీత తండ్రి, సురేఖ వాణి భర్త సురేష్ తేజ అకాల మరణం వారిరువురికి కలచి వేసింది. అదే బాధలో తండ్రికి తలకొరివి పెట్టిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆవేదనను అందరితో పంచుకుంది సుప్రిత. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడ్డారు. దీంతో సుప్రీతతో పాటు సురేఖావాణి కూడా బాధపడిందట. దీంతో తమను తిట్టినవాళ్లకు ధీటుగా సమాధానమిచ్చింది సుప్రీత. మమ్మల్ని నెగెటివ్ కామెంట్స్ చేసేవారు అన్నీ తెలుసుకొని రియాక్ట్ అయితే మేలు. ఎదుటివారిపై ఒక వేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్లు మనల్నే చూపిస్తాయనేది తెలుసుకోండి. ముందు మీ లైఫ్ జాగ్రత్త.. తర్వాత ఇతరుల విషయాల్లో వేలు పెట్టండి. కేవలం మీ వైపు నుంచే చూడకుండా మా వైపు నుంచి కూడా చుడండి. మా కోణంలో ఆలోచించండి. అప్పుడు మీరు సెట్ అవుతారు” అని పేర్కొంది.