logo

ఎండవేడికి నలుగురు వృద్ధుల మృతి


11-Jun-2019 14:44IST
death of four elderly people

కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న నలుగురు వృద్ధులు  ఎండవేడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రయాణంలో ఉండగానే వీరు అస్వస్థతకు లోనయ్యారు. ఝాన్సీకి చేరుకునే సమయానికి ప్రాణాలు కొల్పోయారని అధికారులు తెలిపారు. వీరందరూ 65 ఏళ్లు దాటిన వ‌ృద్ధులు. పోస్ట్‌మార్టమ్ కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. వారణాసి, ఆగ్రాలను సందర్శించేందుకు బయలుదేరిన బృందంలో వీరు సభ్యులు. "మేమందరం ఆగ్రా చూసి వస్తున్నాం. రైలు బయలుదేరిన కొద్ది సేపటికే ఎండవేడి తట్టుకోలేనంతగా పెరిగిపోయింది. ఊపిరాడట్లేదు, ఇబ్బందిగా ఉంది అంటూ కొంతమంది ప్రయాణికులు చెప్పారు.

Tags: 4 elderly people death kerala express sunstorck

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top