logo

ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య


11-Jun-2019 14:58IST
three of the same family were killed

పాట్నా: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణంగా హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న బీహార్‌లోని కిద్వాయ్‌పురిలో చోటుచేసుకుంది. నితిన్‌ సరాఫ్‌ అనే వ్యక్తి వృతిరీత్యా వ్యాపారి. ఈయనకు భార్య ఆక్లా సరాఫ్‌, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సోమవారం రాత్రి నితిన్‌, ఆక్లాతో పాటు వారి కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నితిన్‌ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నితిన్‌ సరాఫ్‌ పాట్నాలో పేరొందిన వ్యాపారి. ఆయనకు చాలా బట్టల షాపులు కూడా ఉన్నాయి. వీరి హత్యకు భూ వివాదాలే కారణమని తెలుస్తోంది.

Tags: three people killed bihar

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top