logo

చ‌ద‌వ‌మంటుంద‌ని..


11-Jun-2019 16:14IST
killed grandmother

నాన‌మ్మ చ‌ద‌వ‌మంటూ ఇబ్బంతి పెడుతోంద‌ని నానమ్మనే చంపేశాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని బందేల్ ప్రాంతంలో జరిగింది. బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఉన్న బందేల్ ప్రాంతానికి చెందిన ఇంద్రనీల్ రాయ్ నిరుద్యోగి. ఇతడి వయసు 27 సంవత్సరాలు. కొంత కాలంగా ఉద్యోగ కోసం వెతుకుతున్నాడు. అయితే అతడి కల కలగానే మిగులుతోంది. అయితే అతడిని బాగా చదవమని అతడి నాయనమ్మ తరుచూ అడుగుతుండేది. దీనితో విసుగెత్తిన ఇంద్రనీల్, ఆదివారం అర్థరాత్రి నాయనమ్మను చంపేశాడు.అయితే ఇది తాను ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రత్యక్ష ప్రసారం పెట్టానని నిందితుడు చెప్పుకొచ్చాడు. అయితే తన ఫేస్‌బుక్ ఐడీ తనిఖీ చేసి అలాంటిదేమీ లేదని పోలీసులు గుర్తించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు వారు పేర్కొన్నారు.

Tags: kills her grandmother irritating read

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top