logo

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం


11-Jun-2019 20:02IST
A road accident in Nepal

నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసున్న‌ది. 60మంది భారత పర్యాటకులతో వెళ్తున్న ఓ బస్సును ట్రక్కు వెనుక నుంచి ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని, మరో 21మందికి తీవ్రగాయాలయ్యాయని మంగళవారం అధికారులు ప్రకటించారు. కాఠ్‌మాండుకు చెందిన ఓ బస్సు చంద్రాపూర్‌ పౌరాయీ అటవీప్రాంతంలోని ఓ మార్గంలో సోమ‌వారం అర్ధరాత్రి ఆగిందని, అదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు దాన్ని ఢీ కొందని స్థానిక పోలీసులు వివరించారు. దీంతో ప్రయాణికులు ఉన్న బస్సు 20మీటర్ల మేర అడవిలోకి దూసుకెళ్లిందని తెలిపారు. మృతులు ఇద్దరూ ఒడిశాకు చెందినవారేనని తెలిపారు. వారి పేర్లు బిజయ్‌  జేనా (51), బిషాల్ (53)గా గుర్తించారు. వారిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చంద్రణిగహపూర్‌ మున్సిపాలిటిలోని ద‌వాఖాన‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిలో సర్బేశ్వర్‌ జేనా, శేషదేవ్‌ జేనా , కర్జున అవాస్ ల పరిస్థితి విషమంగా ఉందని, ప్ర‌త్యేక చికిత్సలు అందిస్తున్నామన్నారు. మిగతా క్షతగాత్రులకు చంద్రణిగహపూర్ ద‌వాఖాన‌లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు కారణమైన ట్రక్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ ఘటన గురించి నేపాల్‌లోని భారత దౌత్యవేత్తలకు సమాచారం అందించినట్లు చెప్పారు.

Tags: road accident Nepal

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top