logo

ఎండ‌ల ధాటికి 50 కోతులు మృతి


12-Jun-2019 14:59IST
over 50 monkeys died

భోపాల్: మ‌ండుతున్న ఎండ‌ల‌కు మూగ‌జీవాలు సైతం మృత్యుఒడికి చేరాయి. మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో వడదెబ్బ, నీటి ఎద్దడి కారణంగా గత వారం రోజుల నుంచి ఇప్పటి వరకు 50 కోతులు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఈ కారణంగా ఎండ వేడిమికి కోతులు చనిపోతున్నట్లు వారు తెలిపారు. ఇక ఆవులు, కుక్కలు అనారోగ్యానికి గురవుతున్నాయని పేర్కొన్నారు. కోతుల మృతితో దామోహ్ ప్రాంతమంతా కాలుష్యమైందని స్థానికులు వాపోయారు. అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags: 50 monkey death bopal

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top