logo

భ‌ర్త మందలించాడ‌ని భార్య ఆత్మ‌హ‌త్య‌..


12-Jun-2019 15:20IST
wife committed suicide

చెన్నై: భార్య చేస్తున్న టిక్‌టాక్‌పై భ‌ర్త మంద‌లించ‌డంతో మ‌న‌స్థాపానికి గ‌రైన భార్య ఆత్మ‌హ‌త్చ చేసుకున్న ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని పెరంబూర్లో చోటుచేసుకుంది. త‌రుచూ టిక్‌టాక్‌లోనే ఉంటున్నావ‌ని కొంచెం టిక్‌టాక్‌కు దూరంగా ఉండ‌మ‌ని భ‌ర్త భార్య‌ను మంద‌లించాడు. దీంతో మనస్తాపానికి లోనైన సదరు వివాహిత టిక్ టాక్ వీడియో చేస్తూనే విషం తాగింది. బయటనుంచి ఇంటికి వచ్చిన భర్త భార్య అచేతనంగా పడి ఉండటాన్ని గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: tik talk thamilnadu death

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top