logo

కొత్త కారులో బొగ్గుముక్క‌లు వేయ‌లేదంటే అంతే సంగ‌తులు!


12-Jun-2019 15:54IST
cole peaces in new car

కోరుకున్న కొత్త వాహనం ఇంటికొస్తున్న సమయం ఓ మధుర జ్ఞాపకం. ఈ సంతోషం జీవితాంతం ఉండాలన్నా, మన ప్రయాణం సాఫీగా సాగాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందు కారు మీద ఏవైనా గీతలు, సొట్టలు పడ్డాయేమో చెక్‌ చేసుకోండి. అన్ని లైట్లు సరిగా పని చేస్తున్నాయా, లేదా పరిశీలించండి. టైర్ల మందం, తయారీదారుడి వివరాలు సరిగా ఉన్నాయో, లేదో ఫాం 22లో చూడాలి. కొత్త బండి స్టార్ట్‌ చేస్తున్నపుడు ఎలాంటి పొగ వెలువడకూడదు. ఏసీ వెంట్ల నుంచి దుర్వాసన రాకుండా చల్లని గాలి రావాలి. ఇవన్నీ సరిగ్గా ఉన్నపుడే బండి డెలివరీ తీసుకోవాలి. ప్లాస్టిక్‌, కెమికల్స్‌ కారణంగా కారు లోపల సహజంగానే ఓ రకమైన వాసన వెలువడుతుంది. దీన్ని తగ్గించడానికి కొన్నాళ్లు ఫ్రెష్‌ ఎయిర్‌ మోడ్‌లోనే బండి నడపాలి. హైవేల్లో వెళ్తున్నపుడు అద్దాలన్నీ కిందికి దించేయాలి. ట్రాఫిక్‌లో ఇలా చేయొద్దు. సీట్ల కింద కొన్ని బొగ్గుముక్కలు పెడితే ఇవి చెడు వాసనల్ని పీల్చుకుంటాయి. అన్నింటికన్నా తేలికైన పరిష్కారం మార్కెట్లో రకరకాల ఎయిర్‌ ఫ్రెష్‌నర్లు దొరుకుతున్నాయి. వాటిని వాడితే చాలు.

Tags: coal peaces new car smell

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top