logo

వ‌రుణ్‌తేజ్‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం


13-Jun-2019 00:11IST
Varuntej is in danger of being missed

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం వ‌ద్ద  జాతీయ రహదారిపై వరుణ్‌ తేజ్‌ కారును మరోక‌ కారు ఎదురుగా వ‌చ్చి ఢీకొట్టడంతో కారు ప్రమాదానికి గురైంది.  హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు షూటింగ్‌ నిమిత్తం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఆయన క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. వాహనం దెబ్బతినడంతో వరుణ్‌ తేజ్‌, ఇంకొందరు నటులు మరో వాహనంలో బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను ఆరా తీస్తున్నారు. మరోవైపు, తనకు జరిగిన ప్రమాదంపై వరుణ్‌తేజ్‌ ప్రమాదం నుంచి తామంతా క్షేమంగా బయటపడ్డామని, ఎవరికీ గాయాలు కాలేదని ట్విటర్‌లో  వివ‌రించారు. 

Tags: varuntej bengulur highway road accident

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top