logo

బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలి దారుణ‌హ‌త్య‌.!


13-Jun-2019 00:19IST
Bar council chairman shot dead by colleague

ఉత్తర్‌ప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలు దర్వేష్‌ సింగ్‌ దారుణ హత్యకు గురయ్యారు. కోర్టు ఆవరణలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నిందితుడు మనీశ్‌ శర్మ అనే ఓ లాయర్‌ కాగా.. కాల్పుల అనంతరం అతడూ ఆత్మహత్యకు యత్నించాడు. కాగా యూపీ బార్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌గా దర్వేష్ మూడు రోజుల కిందటే నియమితులయ్యారు. బుధవారం ఆగ్రాలోని సివిల్‌ కోర్టుకు వచ్చిన ఆమెపై అనే లాయర్‌ కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి దిగడంతో అక్కడికక్కడే మరణించారు. అనంతరం కాల్పులకు పాల్పడిన శర్మను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. దర్వేష్‌కు నిందితుడితో గ‌తంలోనే పరిచయముండ‌గా, బార్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏమైనా వివాదాలు జ‌రిగాయా.? ల‌ఏక మ‌రే ఇత‌ర కార‌ణాలున్నాయా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: bar council uttarpradesh lawyer

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top