logo

నిద్ర‌పోతున్న య‌వ‌తిపై అత్యాచార‌య‌త్నం..


13-Jun-2019 11:07IST
rape on a sleeping girl

సౌత్ ఆఫ్రికా: నిద్ర‌పోతున్న యువ‌తిపై ఓ వ్య‌క్తి దారుణ అత్యాచార‌య‌త్నం చేయ‌బోయాడు. వెంట‌నే నిద్ర‌నుంచి తేరుకున్న యువ‌తి త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు ఆ వ్య‌క్తి నాలుక‌ను కొరికేసింది. కాగా, స‌ద‌రు యువ‌తి ఓ ఆసుప‌త్రిలో డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తోంది. రాత్రి వేళ‌ల్లో ఆసుప‌త్రికి సంబంధించిన క్వార్ట‌ర్స్‌లోనే నిద్ర‌పోతుండ‌గా అదే ఆసుప‌త్రిలోని ఓ పేషెంట్ ఆమెపై అత్యాచార‌య‌త్నానికి ఒడిగ‌ట్టాడు. ఆమె పెదాల‌పై ముద్దుపెట్టుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా యువ‌తి అత‌డి నాలుక‌ను కొరికింది. దీంతో అత‌డి నాలుక రెండు ముక్క‌లుగా విడిపోయింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి నాలుకకు ప్లాస్టిక్ సర్జరీ చేసి తిరిగి అతికిస్తున్న‌ట్లు తెలుస్తోంది. నిందితుడు కోలుకున్న తర్వాత అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. 

Tags: woman bites mans tongue

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top