logo

మ‌ద్యం మ‌త్తులో తండ్రినే చంపాడు..


13-Jun-2019 12:52IST
drink alcohol killed by father

హర్యానా: పీక‌ల‌దాక మ‌ద్యం తాగి ఇంటికొచ్చిన కొడుకు ఏకంగా తండ్రినే చంపేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న హ‌ర్యానాలోని క‌ర్నాల్‌లో చోటుచేసుకుంది. 15 ఏళ్ల యువకుడు పీకల దాకా తాగి ఇంటికొచ్చాడు. ఎందుకు ఇంత‌లా తాగావ‌ని తండ్రి సోమ‌నాథ్ కొడుకుని మంద‌లించాడు. దీంతో తండ్రికొడుకుల మధ్య వాగ్వాదం జ‌రిగి అది కాస్త హత్యకు దారితీసింది. తండ్రి సోమనాథ్‌ను కుమారుడు కత్తితో దారుణంగా పొడిచి చంపి.. అనంతరం పారిపోయాడు. సోమనాథ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Tags: son killed father alcohol

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top