logo

పెళ్లింట్లో ఎలుగుబంటి కలకలం


13-Jun-2019 15:53IST
bears in the marriage

మహాసముంద్: ఆహారం కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వ‌చ్చిన ఓ ఎలుగుబంటి పెళ్లివారింట్లో చొర‌బ‌డి న‌లుగురి గాయ‌ప‌రిచిన ఘ‌ట‌న చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని మ‌హాస‌ముంద్ ప‌రిధిలోగ‌ల భ‌ట‌క్క‌ర్ గ్రామంలో చోటుచేసుకుంది. దాడి అనంత‌రం వారిపోతున్న ఎలుగుబండి నూతిలో ప‌డిపోయింది. స‌మాచారం అందుకున్న అట‌వీ శాఖ అధికారులు 6 గంటలపాటు శ్రమించి ఎలుగును బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే గ్రామంలో శుభం ప్రజాపతి అనే యువకుని వివాహం జరుగుతోంది. ఇంతలో ఎక్కడి నుంచో ఒక ఎలుగుబంటి చొరబడి మహిళలపై దాడికి దిగి, ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. తరువాత ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి మరికొంతమందిపై దాడి చేసింది. అనంతరం అది పారిపోతూ ఒక నూతిలో పడిపోయింది. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు విషయం తెలియజేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని అతి కష్టంమీద ఆ భల్లూకాన్ని బయటకు తీయడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags: bear Attack Chattisgarh marrage function

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top