logo

ప‌రిశ్ర‌మలో ఘోర ప్ర‌మాదం..!


14-Jun-2019 13:40IST
fire accident at chemical company

విజయనగరం బొబ్బిలిలొని ఓ  పారిశ్రామికవాడలోని బాలాజీ కెమికల్స్‌ పరిశ్రమలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభ‌వించింది. పరిశ్రమలోని బాయిలర్‌ పేలడంతో విధుల్లో ఉన్న ఇద్దరు కార్మికులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బొబ్బిలి మండలానికి చెందిన జగదీశ్‌(31), సురేశ్‌(29)గా గుర్తించారు. ఏఎస్పీ గౌతం శాలీ సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను బొబ్బిలి ద‌వాఖాన‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల స‌మాచారం మేర‌కు అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలంలో మంటలు ఆర్పివేశారు. న‌ష్టం రూ.1 కోటి వ‌ర‌కు ఉంటుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు.

Tags: vijayanagaram apstate fire accident

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top