logo

పురుగు మందుతాగి అపస్మారక స్థితిలో..


14-Jun-2019 14:48IST
attempt suicide with  pesticides

విశాఖపట్నం: ఎలమంచిలి పట్టణంలోని ధర్మవరానికి చేందిన వివాహిత అప్పలకొండ సత్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడడా నికి కుటుంబ గొడవలే కారణమని తెలిపారు. ఈమె భర్త లారీ డ్రైవర్ కావడంతో ప్రస్తుతం ఆయన వాహనంతో పొరుగు రాష్ట్రంలో ఉన్నారు. వీరికి పదేళ్ల లోపు వయసుగల నలుగురు పిల్లలు వున్నారు. దీంతో ఈమె పురుగుమందు తాగిన విషయం గుర్తించడమే ఆలస్యమైంది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆలస్యం కావాటంతో పారిస్థితి విషమంగా మారింది దాంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.  భర్తకు సమాచారం ఇచ్చినా ఆయన పొరుగు రాష్ట్రంలో ఉండటంతో ఇక్కడి నుంచి ఆమెను తీసుకెళ్లేవారే కరవయ్యారు. నలుగురు పిల్లలు తల్లివద్ద బోరున విలపిస్తూ ఉండిపోయారు. దీంతో వైద్యులే స్పందించి ఆమెను 108 వాహనంలో అనకాపల్లికి తరలించారు.  ఎలమంచిలి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: attempt suicide pesticides ఎలమంచిలి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top