logo

క్వింటా న‌కిలీ విత్త‌నాలు స్వాధీనం


14-Jun-2019 14:58IST
seized the fake seeds at bellampalli

ఖ‌రీఫ్ కాలం మొద‌లుకానుంది. తొలుక‌రి ప‌లుక‌రింపుకు వేళ‌యింది. రైతులు ద‌క్కులకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌ధ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం  కల్తీ విత్త‌నాలు, ఎరువుల విక్ర‌యించే దుకాణాల‌పై నిఘా పెట్టేందుకు ఆదేశాలిచ్చింది. అన్ని మండ‌లాల్లోని ఎరువుల దుకాణాల‌లో ఏవోలు త‌నిఖీలు చేప‌డుతున్నారు. ప‌త్తివిత్త‌నాలు త‌దిత‌ర క‌ల్తీ ఎరువులు గుట్టుచప్పుడు కాకుండా రైతుల‌కు అంట‌గ‌డుతుండ‌టంతో గ‌త సంవ‌త్స‌రం రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డితే మ‌రికొంద‌రు అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. దీనికి కార‌ణం ఆలోచించిన తెలంగాణ రాష్ర్ట స‌ర్కారు త‌నిఖీలు మ‌రింత ముమ్మ‌రంగా చేయాల‌ని అధికారులకు ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా అధికారులు ఎరువుల దుకాణం త‌నిఖీ చేసి రికార్డులు ప‌రిశీలించి స్టాక్‌ను ప‌రిశీలిస్తారు. క‌ల్తీ ఎరువులు, కాని విత్త‌నాలు క‌నిపిస్తే వెంట‌నే సీజ్ చేస్తారు. త‌ద్వారా క‌ల్తీని అరిక‌ట్ట‌డంతో పాటు రైతుల ఆత్మ‌హ‌త్య‌ల త‌గ్గింపుకు ప‌రోక్షంగా కృషి చేస్తున్న‌ది.
100 కిలోల న‌కిలీ విత్త‌నాలు స్వాధీనం...
బెల్లంపల్లిలోని బజార్‌ఏరియాలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ పత్తివిత్తనాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారస్థుల నుంచి 100 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. బజార్‌ఏరియాలో ఓ బియ్యం డిపో యజమాని సత్యనారాయణ, కాంటాచౌరస్తాలో ఎరువుల వ్యాపారి గంప సత్యనారాయణలు కలిసి ఈ నకిలీ పత్తివిత్తనాలను విక్రయిస్తున్నారన్నారు. బెల్లంపల్లి వ్యవసాయాధికారి ప్రేంకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బియ్యం దకాణం యజమాని బండ సత్యనారాయణ దగ్గర 100 కిలోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించాలనే ఆశతో దొంగచాటుగా నకిలీ పత్తివిత్తనాలను అమ్ముతున్నారని తెలిపారు. కిలో పత్తి విత్తనాలకు రూ.2వేలు ఉంటుందన్నారు. పట్టుకున్న విత్తనాల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందన్నారు. విత్తనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యాపారుల మీద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇలాంటి వ్యాపారాలను చేసే వారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అన్నారు.

Tags: fake seeds bellampally

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top