logo

కోరలు చాస్తున్న డెంగీ


14-Jun-2019 16:14IST
dengue diseases

ఆదిలాబాద్‌:  గతేడాది జిల్లాను వణికించిన ఈ వ్యాధి మరోసారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో 14 జిల్లాలను హైరిస్క్‌గా గుర్తించగా. అందులో ఆదిలాబాద్‌ జిల్లా కూడా ఉంది. చికిత్సకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడంతో రోగం పేరెత్తితేనే సామాన్యుల్లో వణుకు పుడుతోంది.  దీనికితోడు వ్యాధికి గురైన రోగి కొద్ది నెలల పాటు కోలుకోలేని పరిస్థితి ఉండడం ఇబ్బందిగా మారుతోంది.
  • దోమ చెలగాటం..
వర్షాకాలంలో ఈ వ్యాధి విజృంభిస్తుంది. ఆర్థో వైరస్‌లో వ్యాప్తి చెంది ప్రమాదకరమైన వ్యాధిగా మారుతుంది. ఎడిస్‌ ఎజిప్టే అనే దోమ కుట్టడం వలన డెంగీ వస్తుంది. ఈ వ్యాధి సోకిన రోగిని కుట్టి మరో వ్యక్తిని ఈ దోమ కుట్టడం వల్ల డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఏడాదికేడాది డెంగీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సీజన్‌ లేని  సమయంలో కూడా పాజిటీవ్‌ కేసులు నమోదు కావడం తీవ్రతను తెలియజేస్తుంది. ఆదిలాబాద్‌లో కొన్ని సంవత్సరాల క్రితం రిమ్స్‌ వైద్యుడు డెంగీ వ్యాధితో మృతి చెందడం కలకలం రేపింది. ప్రాణాలు కాపాడే వైద్యునికే ప్రాణ రక్షణ లేని పరిస్థితులు రిమ్స్‌ వైద్య కళాశాలలో ప్రస్పుటం అయ్యాయి. 
  • ఒకవైపు సీజనల్‌ వ్యాధులు..
పట్టణ ప్రాంతాల్లో డెంగీ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. డయేరియా (నీళ్ల విరేచనాలు), మలేరియా, చికున్‌గున్యా, యెల్లోఫీవర్‌ వంటి వ్యాధులు మనుషులను చుట్టుముడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా పాజిటీవ్‌ కేసులు అధికంగా నమోదవుతాయి. గిరిజనులకు దోమ తెరలను పంపిణీ చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ నేపథ్యంలో వారిలో అవగాహన కలిగించేందుకు వైద్యఆరోగ్యశాఖ చర్యలు చేపట్టనుంది.

Tags: dengue diseases hospitals patients adilabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top