logo

అధికారులు స్వాధీనం చేసుకున్న చౌకబియ్యం


15-Jun-2019 13:41IST
cheaper acquisition of officers

కడప: నిరుపేదల ఆకలి తీర్చే చౌక బియ్యాన్ని కొందరు వ్యాపారులు అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్సు అధికారులు దాడులు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని పలువురి స్థానికుల వద్ద నుండి సేకరించిన బియ్యాన్నిగుత్తికి చెందిన వ్యాపారులు 21 బస్తాలల్లో 50 కేజిల చొప్పున నింపి స్థానిక రైల్వేస్టేషన్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్నకడప ప్రాంతీయ విజిలెన్సు అధికారి రాజశేఖర్‌రాజు వెంటనే స్పందించి అప్రమత్తమయ్యారు. అధికారి రాజశేఖర్‌రాజు ఆదేశాల మేరకు ఎంపీడీవో ఖాదర్‌బాషా, హెడ్‌కానిస్టేబుల్‌ జనార్దన్‌రావు, కానిస్టేబుల్‌ సునీల్‌ బృందం రంగంలోకి దిగారు. రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫారంలో ఉన్న బస్తాలను పరిశీలించారు. అందులో చౌక బియ్యం ఉన్నట్లు నిర్ధరించారు. అనంతపురం జిల్లా గుత్తికి రైలులో తరలించేందుకు నరసింహులు బియ్యాన్ని సేకరించినట్లు విజిలెన్సు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రాబడి శాఖ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఆర్‌ఐ రమణ, వీఆర్వో సూర్యనారాయణశాస్త్రి పాల్గొన్నారు.   

Tags: cheaper acquisition officers విజిలెన్సు అధికారి రాజశేఖర్‌రాజు

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top