logo

మళ్లీ ఎదురుకాల్పులు


17-Jun-2019 11:27IST
encounter in jammu

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు, ఉగ్ర‌వాదుల‌కు ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు స్థానిక సాయుధ పోలీసులతో కలిసి అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. ఈ గాలింపు సందర్భంగా ఆర్మీ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మన జవాన్లు తిరిగి ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల అనంతరం జవాన్లు ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. క్రికెట్ పోటీల్లో పాక్ పై భారత్ విజయం సాధించిన తెల్లారే జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Tags: Jammu Encounter terrorists

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top