logo

విశాల్ ను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి..


17-Jun-2019 11:36IST
sri reddy comments on vishal

ప్రపంచానికి టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ భూతాన్ని తెలియచేసి సంచలనం రేపిన శ్రీ రెడ్డి హైదరాబాద్ కు బై బై చెప్పి చెన్నైలో స్థరపడిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు నటులపై, డైరెక్టర్లపై లైంగిక ఆరోపణలు చేసే శ్రీ రెడ్డి తాజాగా విశాల్ ను టార్గెట్ చేసింది. ఇంకో వారం రోజుల్లో నడిగర్ సంఘం ఎన్నికలు జరుగనుండగా, బరిలో ఉన్న విశాల్, శరత్ కుమార్ ప్యానల్స్ మధ్య ఇప్పటికే విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతుండగా, తాజాగా, శ్రీరెడ్డి కూడా విమర్శలు మొదలెట్టింది. ఎటువంటి కారణాలు లేకుండానే, ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో విశాల్ ను టార్గెట్ చేసుకుంది. ఆయనపై పలు రకాల విమర్శలు చేసింది. ఇటీవల కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి, ఇతర ప్రముఖ హీరోయిన్లపై విమర్శల దాడి చేయడం ద్వారా తిరిగి వార్తల్లోకి వచ్చింది. 

Tags: sri reddy comments vishal casting couch

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top