logo

ముగిసిన చదరంగం పోటీలు


17-Jun-2019 17:42IST
ended chess tournaments

విజయనగరం: పట్టణంలో నిన్న జరిగిన అండర్‌-15 జిల్లా స్థాయి చదరంగం పోటీలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పోటీలో జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది పైగా క్రీడాకారులు తరలివచ్చారు. ఇందులో మనుహాసిని, ఎస్‌.హరిప్రియ, ఎం.తీక్షణ, బి.వేదశ్రీ, పి.రుద్రమనాయుడు, పి.జితేంద్రనాయుడు, కె.పృథ్వీ, హెచ్‌.అక్షయ అత్యుత్తమ ఆటను ప్రదర్శించి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల తిరుపతిలో 29 నుండి 30 వరకు రాష్ట్ర పోటీలను నిర్వహించనున్నారు. చదరంగం సంఘం అధ్యక్షులు మేకా కాశీ విశ్వేశ్వరుడు, కార్యదర్శి ఈపు విజయకుమార్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిదంగా క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో విశాఖపట్నంకు చెందిన ఆర్బిటర్‌ చీలా రమేష్‌, సహయ ఆర్బిటర్‌ ఎం.గణేష్‌ నాయుడు, విజయనగరానికి చెందిన సోమశేఖర్‌, ఎం.రాజారావు పాల్గొన్నారు. 

Tags: ended chess tournaments 300 మంది పైగా క్రీడాకారులు అండర్‌-15 జిల్లా స్థాయి చదరంగం పోటీలు

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top