logo

యూపీలో దారుణం..


18-Jun-2019 12:40IST
the worst in up

ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంక‌ర్‌
ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సీతాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్ట‌ర్‌ను ఆయిల్ ట్యాంక‌ర్ ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ప్ర‌మాద‌స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను హుటాహుటిన ల‌క్నోలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాద స‌మ‌యంలో ట్రాక్ట‌ర్లో 40 మంది ఉన్న‌ట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గౌత‌మ బుద్ధాన‌గ‌ర్ జిల్లాలోని జేవార్‌కు చెందిన‌వారుగా గుర్తించారు. ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన ట్ర‌క్కు డ్రైవ‌ర్ ప‌రారీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదుచేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Tags: uttar-pradesh road accident people dead

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top