logo

శ‌వాన్ని ఇంట్లో పెట్టుకుని..


18-Jun-2019 14:36IST
keep the body at home

మాజీ పోలీసు అధికారి వింత‌నాట‌కం
చ‌నిపోయిన కూతురు శ‌వాన్ని ఇంట్లో పెట్టుకుని.. నెల రోజుల పాటు శ‌వంతో సావాసం చేశారు త‌ల్లిదండ్రులు. ఇంటికొచ్చిన‌వారు మీ కూతురేద‌ని ప్ర‌శ్నిస్తే నిద్ర పోతుందంటూ బుకాయిస్తున్నారు. ఈ వింత ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర్జాపూర్‌లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. యూపీకి చెందిన ఓ రిటైర్డ్ పోలీసు అధికారి. ఆయ‌న‌కు భార్య‌, కూతురు ఉన్నారు. గత కొన్ని రోజులుగా వీరి ఇంట్లోంచి భరించలేని దుర్వాసన వస్తోంది. ఆ వాసనను భరించలేని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రిటైర్డ్ పోలీసు అధికారి ఇంట్లో సోదాలు జ‌ర‌ప‌గా వారికి కుళ్లిపోయిన ఓ శవం కనిపించింది. ఆ శవం ఆయన కూతురిదిగా గుర్తించారు. అయితే అప్పటికే చనిపోయి నెల రోజులు కావొస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. దీనిపై రిటైర్డ్ పోలీసు అధికారి, ఆయన భార్యను ప్రశ్నించగా వింత వింత‌ సమాధానాలు  చెప్పుకొచ్చారు. తమ కూతురు చనిపోలేదని, నిద్రపోతుందని సమాధానం చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అంతే కాకుండా తామంతా కలిసే ఉన్నామని, తమ ఇంట్లో ఎలాంటి దుర్వాసన రావడంలేద‌ని వాదించారు. వారి సమాధానాలపై అనుమానం వ‌చ్చిన పోలీసులు చుట్టుపక్కలవారిని ప్రశ్నించగా.. ఆ దంపతులు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, ఎవరితో సరిగా మాట్లాడేవారు కాదని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకి తరలించారు. మానసిక రుగ్మతతో బాధపడుతున్న దంపతులు అనుకోకుండా తమ కూతురిని హత్య చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చాక పూర్తి దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.

Tags: varanasi ex-cop daughter’s body month

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top