logo

స్కూల్ బస్సు బోల్తా...


18-Jun-2019 17:37IST
school bus rolling

 నల్గొండ: చింతపల్లి మండలంలోని ముదిగొండ గ్రామంలోని ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడటంతో పలువురి విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ముదిగొండ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు సాయంత్రం విద్యార్థులను ఇంటికి చేరవేసే సమయంలో మల్లారెడ్డి గ్రామం శివారులో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అదుపుతప్పి బోల్తాపడడంతో బస్సులో వున్నా పిల్లలకు గాయాలయ్యాయి. అందులో ఒక విద్యార్ధి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి మరొకరిని  సమీప దేవరకొండలోని  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదంతా స్కూల్ యాజమాన్యం పొరపాటేనని స్థానికులు వ్యక్తపరిచారు. బస్సు నడిపిన డ్రైవర్ పరారిలో వున్నాడని సమాచారం. స్థానిక పోలీసులు ఘటన స్తలానికి వచ్చి పరిశీలించారు .వివరాలు ఇంకా తేలియాల్సి వుంది 

Tags: school bus accident students ముదిగొండ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top