logo

కిరాతకంగా మారిన మాతృత్వం...


19-Jun-2019 16:11IST
the brutal maternal change

కర్ణాటక : పట్టణంలోని కొప్పళ జిల్లాలో ముగ్గురు పిల్లల కన్న తల్లే వారి పాలిట మృత్యువుగా మారిన వైనం చుట్టుపక్కల ప్రాంతాన్ని కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం... కుకనూరు తాలూకా ఎరెహంచినాళ గ్రామంలో మల్లమ్మ, ఉమేశ్‌ దంపతులకు, ముగ్గురు పిల్లలు అక్షత, కావ్య, నాగరాజు. వీరిద్దరూ కొన్నేళ్లుగా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పనికి వెళ్లగా వచ్చిన డబ్బుని మద్యానికి ఖర్చు పెట్టాడు ఉమేశ్‌. దీంతో విరక్తి చెందిన మల్లమ్మ కుటుంబం గడిచేది ఎలా అని ప్రశ్నించేది. దింతో ఇద్దరికీ ఘర్షణ మొదలయ్యేది. 

ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి కూడా భర్త మద్యం తాగి ఇంటికి రావడంతో తీవ్ర ఆవేదనకు గురైన మల్లమ్మ నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పిల్లలను మల్లమ్మ కనికరం లేకుండా నీటిలో ముంచి హత్య చేసి తాను కూడా తాడూతో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లోకెళ్ళి చూడగానే తన భార్యతో పాటు తన పిల్లలు కూడా జీవత్సవంలా మారాడటంతో గట్టిగా ఏడ్చాడు దాంతో గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భర్త మద్యానికి బానిస కావడం, కుటుంబాన్ని వేధించడంతో ఆమె ఈ ఘటనకు పాల్పడిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను కన్న తల్లే దారుణంగా చంపడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags: cruel mother karnataka crime 3 children suicide murder

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top