logo

మళ్లీ అరెస్ట్ అయిన కి'లేడీ'....


19-Jun-2019 16:26IST
matrimony fraud women was arrested yesterday

విదేశీ వరులను పెళ్లి పేరుతో నమ్మించి లక్షల్లో డబ్బులు తీసుకొని మోసం చేస్తున్న కి'లేడీ' అర్చన మళ్లీ అరెస్ట్ అయ్యింది. తెలుగమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపుతూ మ్యాట్రి మోని వెబ్‌ సైట్‌లలో వివరాలు అప్‌లోడ్‌ చేసే విదేశీ వరులను పెళ్లి పేరుతో నమ్మించి లక్షల్లో డబ్బులు తీసుకొని మోసం చేస్తున్న కిలాడీ లేడీని మంగళవారం రాచకొండ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. 

సులువుగా డబ్బులు సంపాదించేందుకు అర్చన మ్యాట్రిమోనీ వెబ్‌ సైట్‌ను వేదికగా చేసుకుంది. గూగుల్‌ నుంచి అందమైన యువతుల ఫొటోలను డౌన్‌ లోడ్‌ చేసుకుని 'తెలుగు మ్యాట్రిమోనీ' వెబ్‌ సైట్‌లో ఫుష్‌ తాయి పేరుతో ప్రొఫైల్‌ క్రియేట్ చేసింది. కేవలం విదేశీ వరులను మాత్రమే పెళ్లి చేసుకుంటానన్న అప్షన్‌ కూడా పొందుపరిచింది. అర్చన ఇచ్చిన ఫోన్‌ నంబర్‌లో సంప్రదించిన వరుడి తల్లిదండ్రులతో గూగుల్‌ యాప్‌ లలో అందుబాటులో ఉన్న మొబైల్‌ అప్లికేషన్ల ద్వారా పలు రకాల వాయిస్‌ లతో మాట్లాడేది. తన మాటలను వరుడు, లేదా వారి తల్లిదండ్రులు నమ్మినట్లు గుర్తిస్తే పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం లేదని చెప్పేది.

కొన్నిరోజులు మాట్లాడిన అనంతరం వరుడికి ఫొటోలు పంపించేది. ఆ తర్వాత ఎంగేంజ్‌ మెంట్‌ రింగ్‌లు, బంగారు నగలు, బహుమతుల పేరుతో లక్షల్లో దండుకునేది.  ఇదే తరహాలో అమెరికాలో ఉంటున్న సింహద్రి పవన్‌ కుమార్‌ అనే యువకుడిని భారత్‌ మ్యాట్రిమోనీ వెబ్‌ సైట్‌ ద్వారా ఫుష్‌ తాయి పేరుతో పరిచయం చేసుకుంది. వెస్ట్‌ పామ్‌ బీచ్, సీస్కో క్లెయింట్‌ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న తాను ఇల్లు మారేందుకు  4 లక్షల రూపాయలు అవసరమని చెప్పడంతో పవన్‌కుమార్‌ ఆమె ఇచ్చిన బ్యాంక్‌ అకౌంట్ కు డబ్బులు పంపాడు.

డబ్బులు అందిన తర్వాత అర్చన అతడితో సంబంధాలు కట్‌ చేయడంతో ఆనుమానం వచ్చిన పవన్‌కుమార్‌ తాను మోసపోయినట్లు గుర్తించి, ఈ విషయాన్ని ఈ నెల 12న రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇటీవల ఇదే తరహా కేసులో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితురాలు పుష్‌తాయి పేరుతో చలామణి అవుతున్న అర్చనను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. మంగళవారం ఆమె బెయిల్‌పై బయటికి రాగానే రాచకొండ పోలీసులు మళ్లీ అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ కు తరలించారు. గతంలోనే ఇదే తరహా కేసుల్లో నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు అర్చనను అరెస్టు చేసి చంచల్‌ గూడ జైలుకు తరలించగా, 2018 డిసెంబర్‌ లో ఓ అడ్వకేట్‌ సహాయంతో బయటకు వచ్చిందని  పోలీసులు తెలిపారు. 

Tags: matrimony fraud women arrested archana

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top