logo

భారీగా రేష‌న్ బియ్యం సీజ్‌


20-Jun-2019 10:52IST
ration rice seaze

అనంత‌పురం: అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్న వాహనంపై విజిలెన్స్‌ అధికారులు కొరడా ఝుళిపించారు. సంఘ‌ట‌నాస్థ‌లంలోనే వాహనాన్ని, పీడీఎస్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. విజిలెన్స్‌ అధికారులు బుధవారం రాత్రి పీడీఎస్ బియ్యం త‌ర‌లుతున్నాయ‌న్న స‌మాచారం మేర‌కు యాడికి కోటవీధిలో తనిఖీ చేశారు. ఆ సమయంలో పీడీఎస్‌ బియ్యంను అక్రమంగా ఐచర్‌ వాహనం లో తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన బండెన్న స్వామి అనే వ్యక్తి కిరాణా వ్యాపారం నడుపుతూ రెండు నెలలు గా స్టోర్‌కు వచ్చే వినియోగదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి కర్నూ లు జిల్లా డోన్‌లోని శ్రీనివాస్‌నగర్‌కు చెందిన ఓ వ్య‌క్తికి విక్ర‌యించేవాడు. ఈ క్రమంలో నే వాహనంలోని 84 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తూ తనిఖీల్లో పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన ఐచర్‌ వాహనంతో పాటు పీడీఎస్‌ బియ్యాన్ని సీజ్‌ చేసి తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు అప్పగిస్తామని ఎస్పీ రామాంజనేయులు తెలిపారు. తనిఖీలలో విజిలెన్స్‌ ఎస్‌ఐ రామకృష్ణయ్య, కానిస్టేబుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: ration pds rice rice seaze

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top