logo

అప్పుల బాధ‌తో న‌వ వ‌రుడు ఆత్మ‌హ‌త్య‌


20-Jun-2019 11:15IST
suiside groom for money problem

ఆ ఇల్లు పెండ్లి సంద‌డితో నిన్న‌టి వ‌ర‌కు హోరెత్తింది. చుట్టాల రాక‌పోక‌లు, కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నామ‌న్న ఆనందం తొణికిస‌లాడింది  ఆ దంపతుల కండ్ల‌ల్లో కానీ ఒక్క‌సారిగా వారి ఇంట విషాదం చోటు చేసుకుంది. కామారెడ్డి మండలం ఇస్రో జివాడి గ్రామానికి చెందిన దుబ్బాక మహేశ్‌(27) అనే యువకుడు నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే గ‌తంలోనే ఇంటిని నిర్మించి అప్పుల పాలైన మ‌హేశ్ కుటుంబం పెండ్లి చేసుకునేందుకు కూడా అప్పులు చేశాడు. అప్పులు తీర్చాల‌ని ఒత్తిడి అధిక‌వ‌డంతో చేసేది లేక జీవితంపై విరక్తి చెంది బుధవారం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకున్నట్లు దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.  కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags: suiside

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top