logo

ఫ్యాన్స్ కు మళ్లీ షాక్ ఇచ్చిన శృతి హాసన్ ..


20-Jun-2019 17:53IST
sruthi hassan has offer in hollywood

పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలు వస్తున్న సమయంలో ఒక్కసారిగా సినిమాలు చేయడం మానేసి ఇండస్ట్రీ నుంచి ఫ్యాన్స్ వరుకు అందరికి షాక్ ఇచ్చింది శృతిహాసన్. ప్రియుడి మైఖేల్ తో పెళ్లి కొరకే శ్రుతి ఈ నిర్ణయం తీసుకుందని అందరు భవించారు. ఐతే సడన్ గా వీరిద్దరూ విడిపోయి మళ్ళీ ఫ్యాన్స్ కు ట్విస్ట్ ఇచ్చింది శృతి హాసన్. ఈ మధ్య లండన్లో కొన్ని లైవ్ మ్యూజిక్ షో లో నిర్వహించిన శృతి మళ్లీ సినిమాలలో నటించేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో రవితేజ సరసన నటిస్తున్న ఈ హీరోయిన్ తమిళ్ లో విజయ్ సేతుపతి సరసన నటిస్తూ బిజీగా ఉంది.
తాజా సమాచారం ప్రకారం శృతి హాలీవుడ్ ఆఫర్ కొట్టేసిందంట. యుఎస్ ఎ నెట్‌వ‌ర్క్ సీరీస్ నిర్మిస్తున్న ట్రెండ్ స్టోన్ సిరీస్ లో ఓ కీలక పాత్ర కోసం నిర్మాతలు శృతి హాసన్ ను సంప్రదించారట. ఇందులో శృతి హాసన్ వెయిట్రెస్ గా చేస్తూ సీక్రెట్ గా హత్యలు చేసే అమ్మాయిగా నటిస్తోందని సమాచారం. థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సిరీస్ ఇండియా, యుఎస్ లో షూట్ చేస్తున్నారు. ఈ సీరీస్ స‌క్సెస్ అయితే శ్రుతిహాస‌న్‌ ఓ రేంజ్ లో ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం తెలుగు, తమిళ్ పరిశ్రమలకు మళ్లీ దూరమవుతుంది అని బాధపడుతున్నారు. 

Tags: sruthi hassan hollywood

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top