logo

పాత‌బ‌స్తీలో ఉద్రిక్త‌త‌: ఎమ్మెల్యే పై దాడి.?


20-Jun-2019 23:52IST
Attack on the MLA

పాతబస్తీలోని జుమ్మెరాత్ బజార్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధురాలు, రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేందుకు ఓ వర్గం ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకు దిగారు. వీరంద‌రికీ మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.  అనుమ‌తి లేనిదే ఒప్పుకోమంటూ పోలీసు అధికారులు తేల్చ‌డంతో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లురువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తలకు గాయాలయ్యాయి. పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. ఎమ్మెల్యేను  ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అన్యాయంగా తమపై పోలీసులు దాడి చేశారని, పోలీసులపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న విలేక‌రుల‌కు తెలిపారు. అయితే ఎవ‌రైనా కావాల‌నే ఎమ్మెల్యేపై దాడి చేశారా..లేక ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టే య‌త్నంలో జ‌రిగిందా అని అధికారులు ఆరా తీస్తున్నారు.

Tags: mla raja sing hyderabad old city police

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top