logo

బాలిక‌పై లైంగిక‌దాడిఐ నిందితుడి రిమాండ్‌


21-Jun-2019 14:07IST
Remanded for sexually abusing a girl

వ‌రంగ‌ల్‌లో 9 నెల‌ల ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారిపై లైంగిక‌దాడికి య‌త్నించి రాష్ర్టంలో సంచ‌ల‌నంగా మారిన ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. 9 సంవ‌త్స‌రాల బాలిక‌పై లైంగిక‌దాడికి య‌త్నించాడు. పోలీసుల వివ‌రాలు ప్ర‌కారం.. భవనంపై నిద్రిస్తున్న‌ బాలిక(9)ను మద్యం మత్తులో లైంగిక‌దాడికి యత్నించిన నిందితుడిని వనస్థలిపురం పోలీసులు  అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నగరానికి వచ్చి చిన్న టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా భవనంపై నిద్రపోయారు. మేస్త్రీ పనిచేస్తున్న శ్రీనివాస్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో నిద్రిస్తున్న‌ బాలికపై లైంగిక‌దాడికి యత్నించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Tags: rape girl hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top