logo

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం


21-Jun-2019 14:53IST
road accident in surya pet

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్‌ జిల్లా కొరరి మండలం చింతపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు సూర్యాపేట జిల్లా జాంపహాడ్‌లోని దర్గాను దర్శించుకునేందుకు శుక్రవారం ఉదయం ఆటోలో వెళ్లారు. దర్గాలో ప్రార్థనలు ముగించుకొని తిరిగి ఆటోలో వస్తుండగా చిల్కూరు మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురుకి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags: suryapet road accident

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top