logo

డంపింగ్‌యార్డులో మళ్లీ మంటలు


21-Jun-2019 17:57IST
fires again in the dumping yard

కరీంనగర్: నగరంలోని బైపాసురోడ్డు డంపింగ్‌యార్డులో మళ్లీ మంటలు చెలరేగాయి. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో డంపింగ్‌యార్డులో ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించింది. దీనికి తోడు పెద్ద గాలులు రావడంతో మంటలు వ్యాపించాయి. పొగ వ్యాపిస్తుండటం, మంటలు ఎగిసి పడుతుండటంతో ఆ ప్రాంతవాసులు ఆందోళనకు గురయ్యారు. గాలికి మంటలు వ్యాపిస్తుండటంతో వెంటనే సమాచారం అందుకున్న నగర మేయర్‌ రవీందర్‌సింగ్‌, కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి అక్కడి చేరుకొని అగ్నిమాపక యంత్రాన్ని పిలిపించి మంటలు ఆర్పించేందుకు ప్రయత్నించారు. పారిశుద్ధ్య, అగ్నిమాపక సిబ్బంది నీళ్లు చల్లుతుండగానే వర్షం కురియడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

Tags: Fires dumping yard rain fire engine

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top