logo

పెళ్లింట విషాదం.. విద్యుదాఘాతంతో న‌లుగురు మృతి


21-Jun-2019 23:35IST
Four people killed by electrocution

పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లయిన ·రెండో రోజే విద్యుదాఘాతంతో పెళ్లి కుమారుడు, అతడి  తల్లిదండ్రులు, మేనత్తతో సహా నలుగురు ఒకేసారి మృతి చెందిన సంఘటన యాదాద్రి జిల్లాలోని  భువనగిరి పురపాలిక కేంద్రం పరిధిలోని ముఖ్తాపూర్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న‌ది. గ్రామస్తులువివరాల ప్రకారం. చింద‌ర‌ సాయి తన కుమారుడికి రేవణపల్లికి చెందిన ఒక అమ్మాయితో జూన్ 19న వివాహం జరిగింది.  పెళ్లి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పెళ్లికుమార్తె ఇంట్లో శుభకార్యం ముగించుకొని తిరిగి అత్త‌గారి ఇల్లైన‌ ముక్తాపూర్‌కు చేరుకున్నారు. పందిట్లో విద్యుత్‌ బల్బులకు వేసిన తీగ ఇనుప స్తంభానికి తగిలించారు. అదే ఇనుప స్తంభానికి బట్టలు ఆరేయడానికి తీగను కట్టారు. ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగ నుండి స్తంభానికి విద్యుత్‌ సరఫరా జరిగి  ఒక్కోక్కరిగా అందరూ పట్టుకోవడంతో వారంతా విద్యుదాఘాతానికి గురయ్యారు. పెళ్లికుమారుడు చిందం ప్రవీణ్‌(22), పెళ్లికుమారుడి తల్లిదండ్రులు చిందం సాయిలు(56), గంగమ్మ(51), పెళ్లికుమారుడి మేనత్త గంగమ్మ(48)లు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు.  పెళ్లికుమారుడి తల్లి అదే తీగపై బట్టలు ఆరవేస్తుండగా విద్యుదాఘాతానికి గురైన‌ట్లు స్థానికులు గుర్తించారు.  వెంటనే కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ద‌వాఖాన‌కు తరలించారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు ధృవీకరించినట్లు గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపారు. మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

Tags: electrocution yadadri district

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top