logo

ఐదేళ్ల కూతురిపై తండ్రి లైంగిక‌దాడి


22-Jun-2019 09:57IST
Father sexually abuses daughter

త‌ప్ప‌తాగి త‌న ఐదేళ్ల కూతురిపై లైంగిక‌దాడికి పాల్ప‌డిన సంఘ‌ట‌న నేరేడ్‌మెట్  పోలీస్‌స్టేష‌న్ పరిధిలోని ద్వారకామయిలో చోటు చేసుకున్న‌ది.   పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం నేరేడ్‌మెట్‌లోని ద్వారకామయి కాలనీలో ఉంటున్న ఒక వ్య‌క్తికి భార్య, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. తొమ్మిదేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు కుటుంబంతో సహా ఉపాధి కోసం వ‌ల‌స వచ్చాడు.  విప‌రీతంగా  మద్యం సేవించి ఇంటికి చేరి ఐదేళ్ల కూతురిపై లైంగిక‌దాడికి దిగిన ఆ నేరగాడిపై భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకొని, న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు శుక్రవారం సాయంత్రం రిమాండుకు తరలించారు.

Tags: neredmet dwarakamai

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top